Temba Bavuma: దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బ‌వుమా రికార్డు... 74 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి

Temba Bavuma creates world record in Test cricket Histrory

  • బవుమా సారధ్యం వహించిన తొలి 9 టెస్టుల్లో ఎనిమిదింట దక్షిణాఫ్రికా గెలుపు
  • ఈ ఘనత సాధించిన రెండవ కెప్టెన్‌గా రికార్డు
  • దిగ్గజ క్రికెటర్ల సరసన నిలిచిన బవుమా

దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్ తెంబా బవుమా ఈమధ్య అదరగొడుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. వ్యక్తిగత ప్రదర్శనతో పాటు సారథిగానూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 

సఫారీలు ఇటీవల పాకిస్థాన్‌పై 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో బవుమా దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరాడు. బవుమా కెప్టెన్‌గా వ్యవహరించిన తొలి 9 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఏకంగా ఎనిమిది విజయాలు సాధించింది. దీంతో, గత 74 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో బవుమా పేరిట ఒక రికార్డు నమోదయింది. కెప్టెన్‌గా తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన రెండవ ఆటగాడిగా బవుమా నిలిచాడు. తద్వారా... ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్, లిండ్సే హస్సెట్‌ల సరసన చేరాడు.

కాగా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పెర్సీ చాప్‌మన్ తొలి 9 టెస్ట్ మ్యాచ్‌లు అన్నింటిలోనూ తన జట్టుని గెలిపించి చరిత్ర సృష్టించి అగ్రస్థానంలో నిలిచాడు. 1921లో చాప్‌మన్ ఈ రికార్డు సాధించాడు. 

ఇదిలావుంచితే, పాకిస్థాన్‌పై టెస్ట్ సిరీస్‌ గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. జూన్ నెలలో ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

  • Loading...

More Telugu News