Bandi Sanjay: కాంగ్రెస్ పాలనలో మహిళలు రూపాయి లబ్ధి పొందలేదు: బండి సంజయ్

Bandi Sanjay blames Congress government

  • ఏఐసీసీ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసే వ్యక్తులతో నిండిపోయిందని విమర్శ
  • కాంగ్రెస్ పార్టీ చేసేది పాలన కాదు... వ్యవస్థీకృత క్రూరత్వమని ఆగ్రహం
  • ఏడాది పాలనలో మహిళలపై నేరాలు పెరిగాయన్న సంజయ్

తెలంగాణ మహిళలు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని, పైగా సాధికారతకు బదులు వారిపై దాడులు చేశారని, ఇళ్లను పడగొట్టారని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏఐసీసీ ఫేక్ న్యూస్ ను వ్యాపింపజేసే వ్యక్తులతో నిండిపోయిందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ చేసేది పాలన కాదని... మహిళలపై వ్యవస్థీకృత క్రూరత్వమని మండిపడ్డారు. తెలంగాణలో ఏడాది వినాశకరమైన కాంగ్రెస్ పాలనలో అత్యాచార కేసులు 28.94 శాతం, మహిళల హత్యలు 13 శాతం, కిడ్నాప్‌లు 26 శాతం పెరిగాయని మండిపడ్డారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ భద్రత ఇస్తామని వాగ్దానం చేసిందని, కానీ భద్రత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురవుతోందన్నారు. కాంగ్రెస్ హయాంలో 10 వేల మంది బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు గురయ్యారన్నారు. కాంగ్రెస్ అబద్ధాల, దోపిడీదారు, విధ్వంసకర పార్టీగా మారిందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News