Formula E Race Case: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు.. ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి, ఏసీబీ విచారణకు అరవింద్ కుమార్ హాజరు

Formula e car case updates

  • తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ కేసు కలకలం
  • దూకుడు పెంచిన ఈడీ, ఏసీబీ
  • ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు

తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసు విచారణలో ఈడీ, ఏసీబీ దూకుడు పెంచాయి. తాజాగా ఈ కేసులో ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. పూర్తి డాక్యుమెంట్లతో ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లినట్టు తెలుస్తోంది. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ను ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్నారు. నగదు బదిలీలో అరవింద్ కుమార్ కీలక వ్యక్తి అనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News