HMPA: దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. ఏడుకు చేరిక

HMPV Cases In India Raised To 7

  • నాగ్‌పూర్‌లో నిన్న ఇద్దరికి సోకినట్టు గుర్తింపు
  • ఇప్పటికే బెంగళూరు, చెన్నై, సేలం, అహ్మదాబాద్‌లో కేసులు
  • బాధితులందరూ 13 ఏళ్ల లోపు వారే
  • భయం అక్కర్లేదంటున్న వైద్య నిపుణులు

ప్రపంచాన్ని భయపెడుతున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) కేసులు మన దేశంలో క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటికి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. నిన్న నాగపూర్‌లో ఇద్దరికి కొత్తగా ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. ఇప్పటికే బెంగళూరులో రెండు, సేలం, అహ్మదాబాద్, చెన్నైలలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. బాధితులందరూ 13 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.

హెచ్‌ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొన్నప్పటికీ ఇది ప్రాణాలు తీసేంత భయంకరమైన వైరస్ కాదని, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గతంలోనే పలు దేశాల్లో గుర్తించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు, యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News