KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు... సుప్రీంకోర్టులో కేటీఆర్ పిటిషన్

KTR files petition in SC

  • కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
  • సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేసిన న్యాయవాది మోహిత్ రావు
  • ముందే కేవియట్ దాఖలు తెలంగాణ ప్రభుత్వం

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్ రావు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ దాఖలు చేశారు.

హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళతారని వార్తలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ముందే కేవియట్ దాఖలు చేసింది. కేటీఆర్ కనుక సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని ఈ పిటిషన్ లో కోరింది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్ లీగల్ టీంతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో గల తన నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ఏం చేయాలనే అంశంపై చర్చించారు. అనంతరం సాయంత్రం గం.4.40కి సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ రేపు (జనవరి 8) విచారణకు వచ్చే అవకాశముంది.

KTR
Supreme Court
BRS
Telangana
  • Loading...

More Telugu News