Sankranti: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు
- జనవరి 13 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించిన ఇంటర్ బోర్డు
- కాలేజీలు తిరిగి 17న తెరుచుకుంటాయని వెల్లడి
- 11న రెండో శనివారం, 12న ఆదివారం సాధారణ సెలవులు
తెలంగాణ ఇంటర్ బోర్డు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ ప్రకటనను విడుదల చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కాలేజీలు తిరిగి జనవరి 17న తెరుచుకుంటాయని ఆ ప్రకటనలో తెలిపింది.
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సెలవు రోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని కాలేజీలకు సూచనలు చేసింది. క్లాస్‌లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సంక్రాంతికి నాలుగు రోజులు సెలవులు కాగా, అంతకుముందు రెండు రోజులు సాధారణ సెలవులు ఉన్నాయి. 11న రెండో శనివారం, 12న ఆదివారం ఉంది. దీంతో ఆరు రోజుల పాటు కాలేజీలు మూతబడనున్నాయి.