G Jagadish Reddy: రేవంత్ రెడ్డి చేసే అబద్ధపు ప్రచారాలు నిలబడవు: జగదీశ్ రెడ్డి

Jagadeesh Reddy says Revanth Reddy blaming KTR

  • కేటీఆర్ తెలంగాణ కోసమే పని చేశారన్న జగదీశ్ రెడ్డి
  • కేటీఆర్‌పై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించరని వ్యాఖ్య
  • కేటీఆర్ తెలంగాణ, హైదరాబాద్ కోసమే పని చేశారన్న జగదీశ్ రెడ్డి

కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసే అబద్ధపు ప్రచారాలు నిలబడవని, తమ పార్టీ నేతపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించరని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కేటీఆర్ తెలంగాణ కోసమే పని చేశారన్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడేలా తయారుచేసేందుకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేశారన్నారు. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ను ముందు నిలబెట్టేందుకు కేటీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. తమపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ మరింత బలపడుతుందన్నారు.

కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. న్యాయస్థానం, చట్టాలపై తమకు నమ్మకం ఉందన్నారు. రేవంత్ రెడ్డి కుట్రలను ఛేదించుకొని కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. అక్రమ కేసులతో బీఆర్ఎస్ నేతలను బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. తమ ప్రజా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వెంటపడతామన్నారు.

  • Loading...

More Telugu News