Vishwanth: ఆహా తెరపైకి మరో క్రైమ్ థ్రిల్లర్!

Hide N Seek Movie Update

  • సెప్టెంబర్ 20న విడుదలైన సినిమా 
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన కంటెంట్ 
  • ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్
  • ఓటీటీ వైపు నుంచి మెప్పించే ఛాన్స్


ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. థ్రిల్లర్ జోనర్ లోని సినిమాలను .. వెబ్ సిరీస్ లను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిని చూపుతూ ఉండటమే అందుకు కారణం. అందువల్లనే సాధ్యమైనంత వరకూ ఈ జోనర్ లో కంటెంట్ ను అందించడానికి అన్ని ఓటీటీలు ట్రై చేస్తూ ఉంటాయి. 

ఈ నేపథ్యంలో 'ఆహా' తెరపైకి ఒక క్రైమ్ థ్రిల్లర్ రానుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి చెందిన ఒక సినిమాను ఈ వారం స్ట్రీమింగ్ చేయడానికి రంగం సిద్ధమైంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా వచ్చేసింది. ఆ సినిమా పేరే 'హైడ్ న్ సీక్'. బసిరెడ్డి రాణా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

ఈ సినిమాలో విశ్వంత్ .. రియా సచ్ దేవ్ .. శిల్ప మంజునాథ్ ప్రధానమైన పాత్రలను పోషించారు. క్రితం ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన, థియేటర్లకు ఎప్పుడు వచ్చి వెళ్లిందనేది ఆడియన్స్ కి తెలియదు. లిజో కె జోన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయిలో అలరిస్తుందనేది చూడాలి. 

  • Loading...

More Telugu News