Book My Show: బుక్ మై షోలో 'సంక్రాంతి' సినిమాల హవా
ఈసారి సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే సినిమాలపై సినీ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాకు ప్రముఖ ఆన్‌లైన్ బుకింగ్స్ యాప్ 'బుక్ మై షో'లో 5.04 లక్షల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపించారు.
అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన 'డాకు మహారాజ్' మూవీ కోసం 2 లక్షల మందికి పైగా ఆసక్తి చూపించారు. ఇక వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూసేందుకు 2.01 లక్షల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపించారు.
దీంతో ఈసారి సంక్రాంతికి ఈ మూడు సినిమాలు వసూళ్లు కుమ్మేయడం ఖాయమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 'గేమ్ చేంజర్' టికెట్ బుకింగ్స్ రేపటి నుంచి ప్రారంభమవుతాయని సమాచారం.