Zahan Kapoor: తీహార్ జైలు చుట్టూ తిరిగే సిరీస్... 'బ్లాక్ వారెంట్'
- తీహార్ జైలు చుట్టూ తిరిగే 'బ్లాక్ వారెంట్'
- ప్రధానమైన పాత్రలో జహాన్ కపూర్
- యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సిరీస్
- ఈ నెల 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
'బ్లాక్ వారెంట్'... కొత్త సంవత్సరంలో 'నెట్ ఫ్లిక్స్' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్న సిరీస్. జహాన్ కపూర్, రాహుల్ భట్, పరమ వీర్ సింగ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి, విక్రమాదిత్య మోత్వాన్-సత్యాన్షు సింగ్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సిరీస్, 'తీహార్ జైలు' చుట్టూ తిరుగుతుంది.
'తీహార్ జైలు'కి ఎంతో చరిత్ర ఉంది. ఎంతోమంది కరడుగట్టిన నేరస్థులను చూసిన జైలు ఇది. ఇక్కడ నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందనేది... ఎలాంటి వాతావరణం ఉంటుందనేది బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకు సంబంధించి జరిగిన ప్రయత్నమే ఈ సిరీస్. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు.
తీహార్ జైలుకి సంబంధించిన మాజీ జైలర్ సునీల్ గుప్తా అనుభవాలు... జర్నలిస్ట్ సునేత్ర చౌదరి రాసిన బుక్ ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. రాజకీయనాయకులు, పోలీస్ అధికారులు, జైలు అధికారులు, ఖైదీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జైలుడ్రామాతో కూడిన డార్క్ థ్రిల్లర్ ఇది. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. చూడాలి మరి ఈ సిరీస్ ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందో.