Karnataka: నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ బాస్... చిరుత‌కే చుక్క‌లు చూపించాడుగా... వైర‌ల్ వీడియో!

Mans Dare Act on Cam Grabs Leopard By Tail Catching Wildcat Who Was on Run for 5 Days

  • క‌ర్ణాట‌క‌లోని రంగపురలో చిరుత సంచారం
  • గ్రామ‌స్థుల‌ను భ‌య‌పెడుతున్న చిరుతను ప‌ట్టుకునేందుకు బోను ఏర్పాటు
  • బోను పెట్టి బంధించేందుకు ప్ర‌య‌త్నించగా చిరుత త‌ప్పించుకునే య‌త్నం
  • పారిపోతున్న చిరుత తోక‌ ప‌ట్టుకుని నిలువరించిన వ్య‌క్తి
  • అత‌ని ధైర్యాన్ని మెచ్చుకున్న అట‌వీశాఖ‌ అధికారులు 

సాధార‌ణంగా ఎవ‌రైనా చిరుత‌ను చూస్తే ఏం చేస్తారు. వెంట‌నే అక్క‌డి నుంచి ప‌రుగు అందుకుంటారు. కానీ, ఓ వ్య‌క్తి మాత్రం చిరుత‌ను చూసి ప‌రిగెత్త‌కుండా దాని తోక‌ను ప‌ట్టుకుని చుక్క‌లు చూపించాడు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని రంగపురలో జ‌రిగింది. 

వివ‌రాల్లోకి వెళితే... రాష్ట్ర‌ రాజ‌ధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని తుమకూరు జిల్లా తిప్టూరు తాలూకాలోని రంగపుర గ్రామంలో ఐదు రోజులుగా చిరుతపులి గ్రామ‌స్థుల‌ను భ‌యబ్రాంతుల‌కు గురి చేస్తోంది. ఇక చిరుత పులి క‌నిపించ‌డంతో గ్రామ‌స్థులు అట‌వీశాఖ అధికారులకు స‌మాచారం ఇచ్చారు. గ్రామ‌స్థుల స‌మాచారంతో అక్క‌డికి వ‌చ్చిన అధికారులు చిరుతపులిని పట్టుకునేందుకు బోనును ఏర్పాటు చేశారు. 

కానీ, బోను పెట్టి బంధించేందుకు ప్ర‌య‌త్నించగా చిరుత త‌ప్పించుకోవాల‌ని చూసింది. ఆ స‌మ‌యంలో గ్రామానికి చెందిన‌ ఆనంద్ అనే వ్యక్తి చిరుతపులి తోకను పట్టుకుని, అది పారిపోకుండా నిలువరించాడు. అనంతరం అధికారులు వల సాయంతో దాన్ని పట్టి బంధించారు. అనంతరం దాన్ని బోనులో వేసి అక్కడ్నించి తరలించారు. త‌న‌ సాహసోపేతమైన చర్యతో చిరుత‌ను ప‌ట్టుకోవ‌డానికి స‌హ‌క‌రించిన అత‌ణ్ని గ్రామ‌స్థులు, అధికారులు అభినందించారు. ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్ అవుతోంది. యువ‌కుడి ధైర్యాన్ని నెటిజ‌న్లు మెచ్చుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News