Oscars 2025: ఆస్కార్ బ‌రిలో 'కంగువా', 'ది గోట్ లైఫ్'

 Kanguva and The Goat Life and four other Indian films in the running for Best Picture in Oscars 2025

  • ఉత్త‌మ చిత్రం విభాగంలో పోటీలో నిలిచిన 207 చిత్రాల జాబితా ప్ర‌క‌ట‌న‌
  • జాబితాలో ఆరు భార‌తీయ సినిమాల‌కు చోటు
  • నామినేషన్ల కోసం రేపు ప్రారంభం కానున్న ఓటింగ్
  • జనవరి 17న తుది నామినేషన్‌లను ప్ర‌క‌టించ‌నున్న‌ అకాడమీ    

97వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌కు కేవలం రెండు నెలల సమయం మాత్ర‌మే ఉంది. దీంతో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది ఆస్కార్‌కు అర్హత సాధించిన 323 చలన చిత్రాల జాబితాను వెల్లడించింది. వీటిలో 207 చిత్రాలు ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో నిలిచాయి. ఇక పోటీలో నిలిచిన వాటిలో ఆరు భారతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. 

కంగువా (తమిళం), ది గోట్ లైఫ్ (హిందీ), సంతోష్ (హిందీ), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ ఆజ్ లైట్‌ (మలయాళం), గ‌ర్ల్స్ విల్ బి గ‌ర్ల్స్ (హిందీ-ఇంగ్లిష్) చిత్రాలు భార‌త్ నుంచి ఉత్త‌మ చిత్రం విభాగంలో ఆస్కార్ బరిలో నిలిచాయి. అయితే, బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచిన కంగువా ఆస్కార్ బ‌రిలో ఉండ‌టం ఏంట‌ని కొంద‌రు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

ఇక నామినేషన్ల కోసం ఓటింగ్ రేపు(జనవరి 8) ప్రారంభమవుతుంది. జనవరి 12న ముగుస్తుంది. అకాడమీ తుది నామినేషన్‌లను జనవరి 17న ప్రకటిస్తుంది. దీంతో ఈ ఐదు సినిమాల్లో ఏదైనా ఒక‌దానికైనా నామినేషన్ దక్కుతుందా అని భారతీయ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ 2025 వేడుక 2025 మార్చి 2న ఓవేషన్ హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో జ‌ర‌గ‌నుంది. 

  • Loading...

More Telugu News