Garikapati: గరికపాటిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. చర్యలు తీసుకుంటామన్న గరికపాటి టీమ్
- యూట్యూబ్ ఛానళ్లు, కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారన్న గరికపాటి టీమ్
- వీటిని ఖండిస్తున్నామని వెల్లడి
- పరువునష్టం కేసులు వేస్తామని హెచ్చరిక
కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొందరు వ్యక్తులు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీమ్ తెలిపింది. గరికపాటిపై వారు చేస్తున్న ఆరోపణలు అసత్యమని పేర్కొంది. వేర్వేరు ఘటనల్లో ఎవరెవరికో ఆయన క్షమాపణలు చెప్పినట్టు, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపింది. వీటిని తాము ఖండిస్తున్నామని... తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, వ్యక్తులపై పరువునష్టం కేసులు వేస్తామని హెచ్చరించింది. వీరి దుష్ప్రచారంతో గరికపాటి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు కలత చెందుతున్నారని తెలిపింది.