Squid Game: స్క్విడ్ గేమ్ లో టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు.. వీడియో ఇదిగో!

Tollywood Heros In Squid Game AI video viral

  • కృత్రిమ మేధ సాయంతో వీడియో సృష్టించిన అభిమాని
  • వైల్డ్ కార్డ్ తో వీళ్లంతా గేమ్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండంటూ ట్వీట్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటోలు, వీడియో

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన సౌత్ కొరియన్ టీవీ షో స్క్విడ్ గేమ్ లో మన హీరోలు పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది..? స్క్విడ్ గేమ్ డ్రెస్ లో మన తారలు ఎలా ఉంటారు..? అనే ఆలోచనతో ఓ అభిమాని రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) సాయంతో రూపొందించిన ఈ వీడియోను, ఫొటోలను ట్విట్టర్ లో పెట్టగా.. ఆయా హీరోల అభిమానులు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

టాలీవుడ్ హీరోలు చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, పవన్ కల్యాణ్, ప్రభాస్ తదితరులతో పాటు బాలీవుడ్ హీరోలు, కమెడియన్లు.. ఇలా సినీ ప్రముఖులతో ఏఐ వీడియో రూపుదిద్దుకుంది. ఈ వీడియోకు ‘ఒకవేళ వీరంతా వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో ‘స్క్విడ్‌గేమ్‌’లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి’ అంటూ సదరు అభిమాని క్యాప్షన్ జతచేశాడు. కాగా, సౌత్ కొరియాలో రూపొందిన టెలివిజన్ షో పేరే ‘స్క్విడ్ గేమ్’. దీనిని వెబ్ సిరీస్ గా మార్చి నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందింది. స్క్విడ్ గేమ్ సిరీస్ కు కొనసాగింపుగా ఇటీవలే స్క్విడ్ గేమ్ 2 రిలీజ్ అయింది. మొదటి వారంలోనే 68 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. 92 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ ర్యాంకింగ్స్ లో టాప్ 1 లో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News