Joju George: అతి తక్కువ బడ్జెట్ .. 60 కోట్ల వసూళ్లు!

Pani Movie Update

  • మలయాళంలో రూపొందిన 'పని'
  • థియేటర్ల నుంచి లభించిన హిట్ 
  • ఈ నెల 16 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్
  • యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో మెప్పించిన కంటెంట్ 
  • జోజు జార్జ్ దర్శకత్వం వహించిన ఫస్టుమూవీ ఇది 


 మలయాళంలో జోజు జార్జ్ కి ఉన్న క్రేజ్ ను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే 'పని'. దర్శకుడిగా ఇది ఆయనకు ఫస్టు మూవీ. అక్టోబరు 24వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లలో విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, అక్కడ 60 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. 

యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, కథాకథనాల పరంగా మంచి మార్కులు కొట్టేసింది. అభినయ .. సాగర్ సూర్య .. అభయ హిరణ్మయి ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ రివేంజ్ డ్రామా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి దీనిని 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలోను అందుబాటులోకి వస్తోంది. 

ఈ సినిమాలో 'గిరి' అనే పాత్రలో జోజు జార్జ్ కనిపిస్తాడు. త్రిసూర్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అక్కడ రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆ ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో బ్రతుకుతూ ఉంటారు. ఆ గొడవ గిరి దంపతులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వారి జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుంది? అనేది కథ. 

  • Loading...

More Telugu News