Allu Arjun: కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun in KIMS hospital

  • కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్
  • కాసేపటి క్రితం కిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన అల్లు అర్జున్
  • ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు. కాసేపటి క్రితం ఆయన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. అల్లు అర్జున్ రాకముందే అక్కడకు సినీ నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. 

అల్లు అర్జున్ రాక నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కూడా తన వంతు సాయం అందించారు.

Allu Arjun
Tollywood
  • Loading...

More Telugu News