Gold Price: మళ్లీ తగ్గిన బంగారం ధర...!

Gold Price

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.78,850
  • 22 క్యారెట్ల బంగారం ధర రూ..72,290

అంతర్జాతీయ పరిణామాలతో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు జరుగుతుంటాయి. ఓ సారి తగ్గితే, మరో సారి పెరుగతూ ఉంటాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర కూడా తగ్గింది. 

మంగళవారం (7వ తేదీ) ఉదయం 7.30 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.72,140, 24 క్యారెట్స్ 78,700 లుగా ఉంది. వెండి కిలో ధర రూ. 98,900లుగా ఉంది. నిన్న (సోమవారం) ధరలతో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై పది రూపాయల మేర తగ్గింది. ఈ నెల 1వ తేదీన వెండి కిలో రూ.98వేలు ఉండగా, నేడు 98,900లకు చేరింది. బంగారం ఈ నెల 1వ తేదీన (22 క్యారెట్స్) 10 గ్రాములు రూ.71,500, (24 క్యారెట్స్) రూ.78,000లుగా ఉంది. 

ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది పరిశీలిస్తే .. హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ బంగారం ధర రూ.72,140లు, 24 క్యారెట్స్ ధర రూ.78,700లు, కిలో వెండి 98,900లుగా ఉంది. విజయవాడలో బంగారం ( 22 క్యారెట్స్) ధర రూ.72,140లు, 24 క్యారెట్స్ ధర రూ.78,700, వెండి కిలో ధర రూ.98,900గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఢిల్లీలో పది గ్రాముల బంగారం (22 క్యారెట్స్) ధర రూ.72,290 లు, 24 క్యారెట్స్ 78,850లు, వెండి కిలో ధర రూ.91,400లుగా ఉంది.     

  • Loading...

More Telugu News