Satya Nadella: ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల భేటీ
- ఏఐని విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామన్న సత్య నాదెళ్ల
- భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయనుండడం సంతోషంగా ఉందన్న సీఈవో
- టెక్నాలజీ, ఇన్నోవేషన్‌పై చర్చించామన్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ అయ్యారు. ఏఐను విస్తరించడంలో భారత్‌తో కలిసి పనిచేస్తామని సత్య నాదెళ్ల తెలిపారు. ప్రధానితో భేటీ అనంతరం సత్య నాదెళ్ల ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భారత్‌ను ఏఐ-ఫస్ట్‌గా రూపొందించడం కోసం పనిచేయనుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి భారతీయుడు వీటి ప్రయోజనాలను పొందడానికి వీలుగా తమ సేవలను విస్తరిస్తామని పేర్కొన్నారు.
సత్య నాదెళ్ళతో భేటీపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్, ఏఐ వంటి అంశాలపై చర్చించినట్లు చెప్పారు. మన దేశంలో మైక్రోసాప్ట్ విస్తరణ, పెట్టుబడుల ప్రణాళిక గురించి సత్య నాదెళ్ల నుంచి తెలుసుకున్నానని, అందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.