Sankrantiki Vastunnam: ఈ సంక్రాంతికి సరైన ట్రీట్... 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్ రిలీజ్
- వెంకటేశ్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టయినర్
- జనవరి 14న విడుదల
- నేడు నిజామాబాద్ లో ట్రైలర్ లాంచ్
విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో... యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రం సంక్రాంతి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
కాగా, నేడు నిజామాబాద్ లో ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్ర తారాగణం అంతా హాజరైన ఈ వేడుకలో ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే... అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ ఎక్కడా మిస్ కాలేదు. ఇక విక్టరీ వెంకటేశ్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గతంలో అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు ఎంత నవ్వించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ చూస్తుంటే, అంతకు రెట్టింపు డోస్ లో వినోదం గ్యారెంటీ అని అర్థమవుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలో కొంత యాక్షన్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టు ట్రైలర్ లో విజువల్స్ చెబుతున్నాయి.