Tovino Thomas: మలయాళంలో ఈ ఏడాది ఫస్టు హిట్ ఇదే!

Identity Movie Update

  • మలయాళంలో రూపొందిన 'ఐడెంటిటీ'
  • ప్రధానమైన పాత్రను పోషించిన టోవినో థామస్ 
  • కీలకమైన పాత్రలో నటించిన త్రిష
  • ఈ నెల 2వ తేదీన విడుదలైన సినిమా 
  • భారీ వసూళ్లతో దూసుకుపోతున్న కంటెంట్

మలయాళం ఇండస్ట్రీకి క్రితం ఏడాది ఒక రేంజ్ లో కలిసొచ్చింది. చాలా సినిమాలు థియేటర్ నుంచి హిట్ పట్టుకునే వెళ్లాయి. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమాలు సైతం భారీ వసూళ్లను రాబడుతూ వెళ్లాయి. ఇక ఈ ఏడాది కూడా తొలి హిట్ తో మలయాళ ఇండస్ట్రీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది... ఆ సినిమా పేరే 'ఐడెంటిటీ'.

టోవినో థామస్ - త్రిష - వినయ్ రాయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అఖిల్ పాల్ - అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీన విడుదలైంది. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఎన్ ఎస్ జీ కమాండోగా టోవినో థామస్ కనిపిస్తాడు. 12 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఇప్పుడు భారీ వసూళ్లతో దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది.

అమర్ అనే ఒక వ్యక్తి ఒక బట్టల దుకాణం నడుపుతూ ఉంటాడు. అక్కడికి వచ్చే మహిళలను టార్గెట్ చేస్తూ వారిని రహస్యంగా వీడియో తీస్తూ ఉంటాడు. అలా పట్టుబడిన అతణ్ణి అక్కడివారు దుకాణంతో పాటు దహనం చేస్తారు. ఈ సంఘటనతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ సంఘటన హరన్, అలీషా, అలెన్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? అనేది కథ. చూడాలి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎక్కడివరకూ వెళుతుందో.

  • Loading...

More Telugu News