Allu Arjun: అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు ఇచ్చిన రాంగోపాల్ పేట పోలీసులు

Police serves notices to Allu Arjun

  • కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్
  • పరామర్శించేందుకు రావాలనుకుంటే తమ సమాచారం ఇవ్వాలన్న పోలీసులు
  • గీతా ఆర్ట్స్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చన పోలీసులు

సినీ నటుడు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందించారు. 

నిన్న కూడా అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావద్దని నోటీసులో పేర్కొన్నారు. ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో ఈ నోటీసులు ఇచ్చారు. కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పరామర్శకు రావాలనుకున్నప్పుడు తమ సూచనలను పాటించాలని పేర్కొన్నారు.

Allu Arjun
Tollywood
  • Loading...

More Telugu News