TDP Office: గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు... నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

AP High Court rejects anticipatory bail for those who attacked TDP office

  • ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన 17 మంది నిందితులు
  • ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు
  • ఈ కేసులో ఏ71గా ఉన్న వల్లభనేని వంశీ

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటన కేసులో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను 17 మంది నిందితులు దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు... ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో మొత్తం 89 మందిని నిందితులుగా చేర్చారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ కేసులో ఏ71గా ఉన్నారు. టీడీపీ కార్యాలయంలోని సామగ్రిని వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేశారు. కార్యాలయం ఆవరణలో ఉన్న కారుకు నిప్పు అంటించారు.

  • Loading...

More Telugu News