Rishabh Pant: ధోనీ ఉన్నాడంటే జట్టులో నమ్మకం పెరుగుతుంది: పంత్

Rishabh Pant Praises Dhoni

  • అతడే నాకు మార్గదర్శి... ఆయనతో పోల్చుకోనని వెల్లడి
  • క్రికెటర్ గా ధోనీ నుంచి ఎన్నో నేర్చుకున్నానని చెప్పిన పంత్
  • భారత క్రికెట్ చరిత్రలో ధోనీ చిరస్థాయిగా నిలిచిపోతాడని ప్రశంసలు 

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడని క్రికెటర్ రిషభ్ పంత్ పేర్కొన్నాడు. ధోనీ ఉంటే జట్టులో ధైర్యం, నమ్మకం పెరుగుతాయని అన్నాడు. ఆయన స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని, ధోనీ తనకు మార్గదర్శి అని చెప్పుకొచ్చాడు. క్రికెటర్ గా, వ్యక్తిగతంగా ధోనీ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని పంత్ చెప్పాడు.

ధోనీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారని, భారత జట్టులోనూ ఆయనకు తనలాంటి అభిమానులు ఉన్నారని వివరించాడు. దేశానికి ఆయన ఓ హీరో అని ప్రశంసలు కురిపించాడు. వికెట్ కీపర్‌ గా, ఆటగాడిగా ఓర్పు అత్యంత కీలకమని ధోనీ తనకు సలహా ఇచ్చారని చెప్పాడు. మైదానంలో ధోనీ సలహాను ఆచరిస్తూ, వంద శాతం ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని పంత్ వివరించాడు. ధోనీ రికార్డులతో నన్ను నేను పోల్చుకోనని, ఇప్పట్లో ఆ రికార్డులను అధిగమించడం సాధ్యం కాదని పంత్ వివరించాడు. 

గణాంకాలలో ఎవరు ఎలా..
ధోనీ.. టెస్టుల్లో 90 మ్యాచ్‌లు ఆడి 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్స్‌ చేశాడు. వన్డేల్లో 350 మ్యాచ్ లలో 321 క్యాచ్‌లు, 123 స్టంపౌట్‌లు, 98 టీ20లలో 57 క్యాచ్‌లు, 34 స్టంపింగ్స్‌ చేశాడు. 
రిషభ్‌ పంత్‌.. 43 టెస్టుల్లో 149 క్యాచ్‌లు, 15 స్టంపింగ్స్‌. 31 వన్డేల్లో 27 క్యాచ్‌లు, ఒక స్టంపౌట్‌. 76 టీ20ల్లో 38 క్యాచ్‌లు, 11 స్టంపింగ్స్‌ చేశాడు.

  • Loading...

More Telugu News