KTR: తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది: కేటీఆర్

KTR fires on Revanth Reddy

  • రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి సీఎం స్థాయిలో వ్యవహరిస్తున్నారన్న కేటీఆర్
  • ఎమ్మెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని మండిపాటు
  • విచ్చలవిడిగా అధికారాన్ని చెలాయిస్తున్నారని విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సీఎం స్థాయిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బదులు అధికార కార్యక్రమాల్లో తిరుపతి రెడ్డి ఎలా పాల్గొంటున్నారని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి చెక్కులను ఏ అధికారంతో పంపిణీ చేస్తున్నారని నిలదీశారు. ఇలాంటివి రేవంత్ రెడ్డి అరాచక పాలనలోనే జరుగుతాయని దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. 

ప్రొటోకాల్ తో సంబంధం లేకుండా రెండు కాన్వాయ్ లు, గన్ మన్లతో విచ్చలవిడిగా తిరుపతి రెడ్డి అధికారాన్ని చెలాయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్ కు కొత్త ఎమ్మెల్యే కావాలనుకుంటే మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతుందని అన్నారు. ఈ కుటుంబ పాలన, రాజ్యాంగేతర వ్యవస్థ దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో జరిగే విషయాలు తెలుసా? అని అడిగారు.

  • Loading...

More Telugu News