Balakrishna: మూడు ఫ్యామిలీల నుంచి ముగ్గురు హీరోలు .. సంథింగ్ స్పెషల్ గా సంక్రాంతి!

Sankranthi Herolu

  • నందమూరి ఫ్యామిలీ నుంచి 'డాకు మహారాజ్'
  • దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం'
  • మెగా ఫ్యామిలీ నుంచి 'గేమ్ ఛేంజర్'
  • క్రితం ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచిన అక్కినేని ఫ్యామిలీ         

పంటలు ఇంటికి చేరిన తరువాత జరువుకునే పండుగ సంక్రాంతి. ఆ సంతోషంతో కూతురును .. అల్లుడిని ఇంటికి ఆహ్వానించే ఆనవాయతి. బంధు మిత్రులతో సరదాగా గడిపే సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా కనిపిస్తూ వస్తోంది. అలాంటి సమయంలో కొత్త సినిమాలు థియేటర్లలో దిగిపోవడం కూడా చాలా కాలంగా వస్తున్న ఆచారంగా మారిపోయింది. అలా ఈ సారి సంక్రాంతి బరిలో 'డాకు మహారాజ్' .. 'సంక్రాంతికి వస్తున్నాం' .. 'గేమ్ ఛేంజర్' పలకరించనున్నాయి. సాధారణంగా సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు .. పెద్ద సినిమాలు బరిలోకి దిగిపోతూ ఉంటాయి. ఇండస్ట్రీలో హీరోల పరంగా మెగా ఫ్యామిలీ .. నందమూరి ఫ్యామిలీ .. దగ్గుబాటి ఫ్యామిలీ .. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రానుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నాలుగు ఫ్యామిలీలలో ఏదో ఒక ఫ్యామిలీకి చెందిన సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సారి ఒక్క అక్కినేని ఫ్యామిలీ నుంచి తప్ప మిగతా మూడు ఫ్యామిలీల నుంచి సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ రూపొందించిన 'డాకు మహారాజ్' కోసం మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా అలరించనుంది. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను సిద్ధం చేశాడు. కామెడీ టచ్ తో సాగే ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ఆకట్టుకోనుంది. ఇక చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' విడుదల కానుంది. ఇలా మూడు ఫ్యామిలీల నుంచి మూడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం ఒక రేర్ ఫీట్ గానే చెప్పుకోవాలి. ఈ బరిలో నాగ్ లేరనే ఫీలింగ్ ఫ్యాన్స్ కి లేదు. ఎందుకంటే 'నా సామిరంగ' సినిమాతో క్రితం ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది ఆయనే.

  • Loading...

More Telugu News