Donald Trump: ఇటలీ ప్రధానితో కలిసి సినిమా చూసిన ట్రంప్.. అద్భుతమైన మహిళ అంటూ ప్రశంస

Trump Watches Movie With Italian PM Meloni

  • మార్ ఎ లాగో ఎస్టేట్ లో ట్రంప్ తో మెలోని భేటీ
  • డిన్నర్ చేసి, సినిమా చూసిన ఇరువురు నేతలు
  • ఇటీవల కెనడా, హంగేరీ ప్రధానులతోనూ ట్రంప్ సమావేశం

ఇటలీ ప్రధాని జార్జియా మెలొని అద్భుతమైన మహిళ అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. మెలొనిని కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. శనివారం ట్రంప్ ఎస్టేట్ మార్ ఎ లాగోలో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. మెలొనితో డిన్నర్ చేసిన ట్రంప్.. ఆపై ‘ది ఈస్ట్ మన్ డైలమా’ అనే సినిమా చూశారని అమెరికా మీడియా కథనాలు ప్రచురించాయి. ‘ది ఈస్ట్ మన్ డైలమా’ సినిమా 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంటరీ.. ఎన్నికల ఫలితాలను ట్రంప్ కు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారంటూ ఓ లాయర్ పై అభియోగాలు మోపడమే కథాంశం.

ట్రంప్, మెలొని ఇద్దరూ కలుసుకోవడం, ట్రంప్ ఎస్టేట్ లోని రిసెప్షన్ ఏరియాలో వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోలను అమెరికా మీడియా సంస్థలు ఆదివారం ప్రచురించాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రోమ్ లో నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు మెలొని అమెరికా వెళ్లడం, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. 

మెలొని పర్యటన వెనక ఉద్దేశంపై ఇటలీ ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ వరుసగా విదేశీ ప్రతినిధులతో తన ఎస్టేట్ లో భేటీ అవుతున్నారు. కెనడాపై టారిఫ్ లు పెంచుతానని ప్రకటించిన మరుసటి రోజే ట్రంప్ ను మార్ ఎ లాగో ఎస్టేట్ లో జస్టిన్ ట్రూడో కలుసుకున్నారు. ఇరువురు నేతలు సమావేశమై టారిఫ్ లపై చర్చించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. హంగేరి ప్రధాని విక్టర్ ఆర్బాన్ కూడా ఇటీవల ట్రంప్ తో భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News