Vaishnavi Chaitanya: వైష్ణవీ చైతన్య .. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ!

Vaishnavi Chaitanya Special

  • 'బేబి' సినిమాతో అలరించిన వైష్ణవి 
  • ఫస్టు సినిమాతో విపరీతమైన ఫాలోయింగ్ 
  • అంతగా ఆకట్టుకోని 'లవ్ మీ'
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 'జాక్ .. కొంచెం క్రాక్'
  • ఆమె వరుస సినిమాలు చేయాలంటున్న ఫ్యాన్స్


తొలి సినిమాతోనే హిట్ కొట్టాలి .. అప్పుడే అవకాశాలు వరుసబెడతాయి. అలా వరుసగా చేసుకుంటూ వెళ్లిన కొన్ని సినిమాలలో ఒకటి రెండు ఫ్లాప్ అయినా పెద్దగా కంగారు పడవలసిన పని లేదు. వాటిని మరిపించే హిట్స్ వెంటనే పడిపోతే సరిపోతుందని హీరోయిన్స్ భావిస్తూ ఉంటారు. అందువల్లనే వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే అందుకు భిన్నంగా వైష్ణవీ చైతన్య వ్యవహరించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

'బేబి' సినిమాతో వైష్ణవీ చైతన్య యూత్ ను ఒక ఊపు ఊపేసింది. వైష్ణవి పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆ పాత్రకి ఆమె యాడ్ చేసిన గ్లామర్ .. నటన .. ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించింది. ఆ సినిమా హిట్ తరువాత ఇక ఆమె హవా కొనసాగుతుందని అంతా భావించారు. కానీ ఏడాది తరువాత ఆమె నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది .. ఆ సినిమా పేరే 'లవ్ మీ'. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. వైష్ణవీ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. 

వైష్ణవీ తాజా చిత్రంగా 'జాక్ .. కొంచెం క్రాక్' రూపొందుతోంది. సిద్ధూ జొన్నలగడ్డ జోడీగా ఈ సినిమాలో ఆమె కనిపించనుంది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అంటే 'లవ్ మీ' తరువాత ఏడాదికి ఈ సినిమా వస్తోంది. ఏ రోజుకారోజు కొత్త హీరోయిన్స్ ఎంటరవుతుంటారు గనుక, వైష్ణవీ కాస్త స్పీడ్ పెంచవలసిందేననేది ఫ్యాన్స్ టాక్. 

Vaishnavi Chaitanya
Actress
Siddhu Jonnalagadda
  • Loading...

More Telugu News