Game Changer: ’గేమ్ చేంజర్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి
- రాజమహేంద్రవరంలోని వేమగిరిలో ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- కాకినాడ గైగోలుపాటు నుంచి బయలుదేరిన యువకులు
- జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి వెనక్కి
- వడిశలేరు వద్ద వారి బైక్‌ను ఢీకొట్టిన వ్యాన్
'గేమ్ చేంజర్' సినిమా వేడుకకు వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) శనివారం రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరిగిన రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బైక్‌పై వచ్చారు. అయితే, అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి కాకినాడ బయలుదేరారు.
ఈ క్రమంలో రాత్రి 9.30 గంటల సమయంలో వడిశలేరులో ఎదురుగా వచ్చిన వ్యాన్ వారి బైకును బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ వెంటనే 108 వాహనంలో పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే వారు మృతి చెందినట్టు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.