Charlapalli Raiway Terminal: సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఆ రెండు రైళ్లు ఇకపై చర్లపల్లి నుంచి

Those two trains which were supposed to depart from Secunderabad and Hyderabad will now depart from Charlapally

  • హైదరాబాద్ నుంచి చెన్నై సెంట్రల్, సికింద్రాబాద్ నుంచి గోరఖ్‌పూర్‌కు రైళ్లు
  • మార్చి 12 నిర్ణయం అమల్లోకి వస్తుందన్న రైల్వే
  • రేపటి నుంచి చర్లపల్లిలో ఆగనున్న మూడు రైళ్లు
  • సంక్రాంతి ప్రత్యేక రైళ్లలో కొన్ని నేటి నుంచి చర్లపల్లి నుంచి అందుబాటులోకి

హైదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే రైలు (12603/12604)తోపాటు సికింద్రాబాద్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లే రైలు (12589/12590) ఇక నుంచి చర్లపల్లిలోని నూతన టెర్మినల్ నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మార్చి 12 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే, రేపటి (7వ తేదీ) నుంచి సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (12757), సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్ (12757), గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201), సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202), సికింద్రాబాద్-సిర్పూర్‌ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలు (17233), సిర్పూర్‌ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైలు (17234) చర్లపల్లిలో ఆగుతాయని అధికారులు తెలిపారు. 

సంక్రాంతి నేపథ్యంలో ఈ నెల 6 నుంచి 18 వరకు 52 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని, వీటిలో కొన్ని నేటి నుంచి చర్లపల్లిలోని నూతన టెర్మినల్ నుంచి నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

  • Loading...

More Telugu News