indian mega war weapon: మన బ్రహ్మోస్ మిస్సైల్ పై ప్రపంచ దేశాల ఆసక్తి
- భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిధిగా విచ్చేస్తున్న ఇండోనేషియా అధ్యక్షుడు
- బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుపై ప్రధాని మోదీతో చర్చించనున్న ఇండోనేషియా అధ్యక్షుడు
- స్వయంప్రతిపత్తితో దిశ మార్చుకుని శత్రు లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేయగల క్షిపణి బ్రహ్మోస్
భారత్ – రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఇప్పటికే ఈ క్షిపణిని ఫిలిప్పీన్స్ కొనుగోలు చేయగా, ఇప్పుడు ఇండోనేషియా, వియత్నాంలు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌లోని బ్రహ్మపుత్ర, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లు కలిసి వచ్చేలా ఈ క్షిపణికి బ్రహ్మోస్‌గా నామకరణం చేశారు.
ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ నెలలో మన దేశంలో పర్యటించనున్నారు. ఈ ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా ఆయన హాజరవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.
ఈ సందర్భంగా భారత అస్త్రం బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుపై కీలక ఒప్పందం చేసుకోనున్నారని వార్తలు వినబడుతున్నాయి. దీనిపై ఒప్పందం కుదిరితే రెండేళ్లలో భారత్ బ్రహ్మోస్ క్షిపణిని ఇండోనేషియాకు అందించనుంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న ఈ బ్రహ్మోస్ క్షిపణి అంటే మన శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్‌కు ఒకింత భయమేనని సమాచారం.
ఈ క్షిపణి ప్రత్యేకతలు ఏమిటంటే.. అద్భుతమైన వేగం, ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకుపోతూ, గాలిలో ఉండగానే తన గమనాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. లాంచ్ చేసిన తర్వాత తన దిశను సర్దుబాటు చేసుకుంటూ స్వయంప్రతిపత్తితో శత్రువుల లక్ష్యాన్ని గుర్తించి నాశనం చేస్తుంది.