Sourav Ganguly: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ సిరీస్ కోల్పోవడానికి కారణం చెప్పిన గంగూలీ
- బ్యాటింగ్ వైఫల్యమే జట్టును ముంచిందన్న గంగూలీ
- రోహిత్, కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదని విమర్శ
- 180 పరుగులతో జట్టు గెలవడం సాధ్యం కాదన్న మాజీ కెప్టెన్
- కోహ్లీ త్వరలో ఫామ్ అందుకుంటాడని ఆశాభావం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు ఘోర పరాభవంపై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యమే జట్టును ముంచిందని తెలిపాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదని విమర్శించాడు.
ఎక్కువ రన్స్ చేయకపోతే టెస్టుల్లో విజయం సాధించడం సాధ్యం కాదని గంగూలీ పేర్కొన్నాడు. 170, 180 పరుగులు చేసి గెలుద్దామనుకుంటే కుదరదని స్పష్టం చేశాడు. జట్టు కనీసం 350 నుంచి 400 పరుగులు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఈ పరాజయానికి ఏ ఒక్కరినీ నిందించలేమని పేర్కొన్నాడు. కోహ్లీ గొప్ప ఆటగాడేనని, బలహీనతను అధిగమించి ఫామ్ అందుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్‌శర్మకు ఏం చేయాలో తెలుసని, సిడ్నీ టెస్టుకు దూరం కావడం అతడి వ్యక్తిగత నిర్ణయమని గంగూలీ పేర్కొన్నాడు.