Daaku Maharaaj: 'డాకు మ‌హారాజ్' ట్రైల‌ర్ ఫుల్ ప‌టాస్‌.. బాల‌య్య యాక్ష‌న్ అదుర్స్‌!

Daaku Maharaaj Theatrical Trailer Out Now

  • బాల‌య్య‌, బాబీ కాంబోలో 'డాకు మ‌హారాజ్'
  • ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా మూవీ రిలీజ్ 
  • బాల‌య్య‌ను కొత్త‌గా చూపించిన బాబీ
  • అదిరిపోయిన యాక్ష‌న్, విజువ‌ల్స్

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా బాబీ కొల్లి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న మాస్ యాక్ష‌న్ మూవీ 'డాకు మ‌హారాజ్‌'. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ఈ నెల 12న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. డాకు మ‌హారాజ్ ట్రైల‌ర్ ఫుల్ ప‌టాస్‌గా ఉంది. త‌మ‌న్ అందించిన బీజీఎం ఓ రేంజ్‌లో ఉంది. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని సమ పాళ్లలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఎలివేష‌న్స్ సీన్స్ చించేశాడు బాబీ. బాలకృష్ణని బాబీ చాలా కొత్తగా చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.

"అనగ‌న‌గా ఒక రాజు ఉండేవాడు. చెడ్డ‌వాళ్లంతా ఆయ‌న్ను డాకు అనేవాళ్లు. నాకు మాత్రం మ‌హారాజు" అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. బాల‌య్య‌ను ఉద్దేశించి చిన్నారి చెప్పే "ఇక్క‌డ కింగ్ ఆఫ్ జంగిల్" అనే డైలాగ్‌తో పాటు ట్రైల‌ర్ చివ‌ర‌లో వ‌చ్చే "మైఖేల్ జాక్స‌న్‌.. డేంజ‌ర‌స్" డైలాగ్ కూడా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. 

మొత్తానికి బాల‌కృష్ణ యాక్ష‌న్‌, సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ట్రైల‌ర్ చూస్తుంటే ఈసారి పొంగ‌ల్ కు కూడా బాల‌య్య ఖాతాలో మ‌రో హిట్ ప‌డేలానే ఉంది. 2023 సంక్రాంతికి విడుదలైన వీర‌సింహారెడ్డితో ఆయ‌న‌ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. 

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, ఊర్వశీ రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

  • Loading...

More Telugu News