producer naga vamsi: అభిమానుల మద్దతు కోరుతున్న టాలీవుడ్ యువ నిర్మాత

producer naga vamsi request to his fans

  • ఎక్స్ వేదికగా డాకు మహారాజ్ మూవీ నిర్మాత నాగవంశీ ఆసక్తికర పోస్టు
  • అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి ప్రయత్నిద్దామన్న నాగవంశీ
  • సోషల్ మీడియాలో నాగవంశీ ట్వీట్ వైరల్

సినీ అభిమానులను ఉద్దేశించి అగ్ర నిర్మాత నాగవంశీ తాజాగా ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'ఇది మన అందరి సినిమా. నాకు మీ అందరి సపోర్టు చాలా అవసరం. అందరం ప్రశాంతంగా ఉండి మన సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి ప్రయత్నిద్దాం' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

నాగవంశీ నిర్మాణంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం 'డాకు మహారాజ్' సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News