Daaku Maharaj: 'డాకు మ‌హారాజ్' టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి

Daaku Maharaj Ticket Hike Special Benefit Shows Approved in AP

  • బాలకృష్ణ, బాబీ కాంబోలో డాకు మహారాజ్‌
  • ఈ నెల 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న సినిమా
  • విడుదల రోజున ఆరు షోలు
  • బెనిఫిట్ షో టికెట్ ధ‌ర‌ రూ.500గా నిర్ణ‌యించిన ఏపీ ప్ర‌భుత్వం
  • మల్టీప్లెక్స్ లో రూ.135, సింగిల్ స్క్రీన్ పై రూ.110 వరకు పెంపు
  • ఇవే రేట్ల‌తో జనవరి 12 నుంచి 25 వరకు రోజుకు ఐదు షోలకు అనుమ‌తి

నంద‌మూరి బాలకృష్ణ, యువ ద‌ర్శ‌కుడు బాబీ కొల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా డాకు మహారాజ్‌. సంక్రాంతి బ‌రిలో ఉన్న ఈ మూవీ ఈ నెల 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం పాట‌లు, టీజ‌ర్‌, పోస్ట‌ర్స్ డాకు మహారాజ్‌పై అంచ‌నాలు పెంచేశాయి. దీంతో ఈ సినిమా కోసం నంద‌మూరి అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. 

కాగా, ఈ సినిమా టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ఏపీ ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ చిత్రానికి అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. జనవరి 12న ఉదయం 4 గంటలకు  స్పెష‌ల్‌ బెనిఫిట్ షోకు అనుమతించింది. ఈ షోకి టికెట్ రేటును రూ.500 (జీఎస్‌టీతో క‌లిపి) గా నిర్ణ‌యించింది.  

మొద‌టి రోజు నుంచి జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు రోజుకు ఐదు షోల‌కు అనుమ‌తి ఇచ్చింది. ఈ షోల‌కు మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.110 పెంపున‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జ‌రిగింది.  

కాగా, ఇవాళ‌ అమెరికా నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చిత్ర యూనిట్‌ డల్లాస్‌లో ఘనంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించ‌నుంది. దీనికోసం ఇప్ప‌టికే హీరో బాల‌య్య‌తో పాటు చిత్ర బృందం అక్క‌డికి చేరుకున్నారు. ఈ ఈవెంట్‌లోనే సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నార‌ని తెలుస్తోంది.     

  • Loading...

More Telugu News