devajit saikia: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి కొత్త కార్యదర్శి... ఎవరంటే!

devajit saikia likely to be elected unopposed as bcci secretary

  • బీసీసీఐ కొత్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికవ్వబోతున్న దేవ్‌జిత్ సైకియా
  • శనివారం సాయంత్రంతో ముగిసిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
  • కార్యదర్శి పదవికి దేవ్‌జిత్ సైకియా ఒక్కరే నామినేషన్
  • ఈ నెల 12న జరగనున్న బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్న ఎన్నికల అధికారి

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త కార్యదర్శిగా దేవ్‌జిత్ సైకియా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 12న ముంబయిలో బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నిక జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల దాఖలు ప్రకియ శనివారంతో ముగిసింది. కార్యదర్శి పదవికి ప్రస్తుత తాత్కాలిక కార్యదర్శిగా ఉన్న దేవ్‌జిత్ సైకియా (అస్సాం), కోశాధికారి పదవి కోసం ఛత్తీస్‌గడ్‌కు చెందిన ప్రభతేజ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు. 

శనివారం సాయంత్రం నామినేషన్ల స్వీకరణ ముగిసే సమయానికి వీరిద్దరే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ఇద్దరూ ఆయా పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనప్రాయమైంది. 12వ తేదీన జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి వీరిరువురి ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. 

ఇటీవలి కాలం వరకూ బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నిక అవ్వడం, బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన అశిష్ షెలార్ మహారాష్ట్రలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కార్యదర్శి, కోశాధికారి ఎన్నికల ప్రక్రియను బీసీసీఐ చేపట్టింది.   

  • Loading...

More Telugu News