Nara Lokesh: జగన్ గాలిలో కాకుండా రోడ్లపైకి వచ్చి మేం చేసిన మంచిని చూడాలి: నారా లోకేశ్

Nara Lokesh comments on Jagan in Vijayawada

  • విజయవాడలో లోకేశ్ ప్రెస్ మీట్
  • తమది ప్రజా ప్రభుత్వమని స్పష్టీకరణ
  • ఇచ్చిన హామీలే కాకుండా, హామీ ఇవ్వనివి కూడా అమలు చేస్తున్నామని వెల్లడి
  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎవరూ అడగకుండానే అమలు చేస్తున్నామని వివరణ

విజయవాడ పాయకాపురం జూనియర్ కళాశాలలో ఇవాళ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన అనంతరం రాష్ట్ర విద్యా శాఖ  మంత్రి నారా లోకేశ్ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను పద్ధతి ప్రకారం  నెరవేరస్తున్నామని స్పష్టం చేశారు. హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నామని వెల్లడించారు. 

ఎవరూ అడగకుండానే ఇంటర్ విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు గాలిలో కాకుండా రోడ్డుపైకి వచ్చి తాము చేస్తున్న మంచి పనులను చూడవచ్చని లోకేశ్ పేర్కొన్నారు. 

"జగన్ ప్రజల్లోకి వచ్చి సమస్యలు తెలుసుకోవడంలో తప్పులేదు. ఇప్పుడు రోడ్లు కూడా మంచివి వేశాం, ఆయన నిర్భయంగా రోడ్లపైకి రావచ్చు. ఇంకా మేం చేయాల్సి చాలా ఉంది, అన్నీ చేస్తాం. జగన్ వచ్చి మేం అమలుచేస్తున్న మంచి కార్యక్రమాలు చూడాలని కోరుతున్నాం. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తాం. 

గత ప్రభుత్వంలో మాదిరి మాది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాదు. ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాం. ప్రజాదర్బార్ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నాం. గత ప్రభుత్వ తప్పుల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. రూ.4 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేల పెన్షన్ అందజేస్తున్నాం. గత ప్రభుత్వం మూసివేసిన అన్నక్యాంటీన్లు తెరిచాం. ఉచిత గ్యాస్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాం" అని వివరించారు.

  • Loading...

More Telugu News