Arvind Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌లపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు

Arvind Kejriwal Big Charge on BJP and Congress

  • పంజాబ్‌లో హామీలు నెరవేర్చలేదంటూ కేజ్రీవాల్ నివాసం ఎదుట మహిళల ధర్నా
  • బీజేపీ, కాంగ్రెస్ కావాలని తమపై దాడి చేస్తున్నాయని కేజ్రీవాల్ ఆగ్రహం
  • ఢిల్లీలో రెండు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని ఆరోపణ
  • తమపై ఉమ్మడిగా పోటీ చేస్తున్నామని బీజేపీ, కాంగ్రెస్ ప్రకటన చేయాలని డిమాండ్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ 29 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ పలువురు మహిళలు ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసనపై కేజ్రీవాల్ స్పందించారు. 

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కావాలని తమపై అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కూటమిగా ఏర్పడి తమపై దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. తన ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన మహిళలు ఆ రెండు పార్టీలకు చెందిన వారేనని ఆరోపించారు. ఆ మహిళలు పంజాబ్ నుంచి రాలేదన్నారు. పంజాబ్‌లో తమకే మద్దతు ఉందన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీపై పోటీ చేస్తున్నామని బీజేపీ, కాంగ్రెస్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

  • Loading...

More Telugu News