Sreeleela: తమన్నా అలా అనేసింది... శ్రీలీల ఇలా డిసైడైపోయింది!

Sreeleela Special

  • 'జైలర్'లో సందడి చేసిన తమన్నా 
  • ఆమె ఐటమ్ ఆ సినిమాకి హైలైట్ 
  • 'పుష్ప 2'లో మాస్ స్టెప్పులేసి శ్రీలీల
  • అలాంటి అవకాశాలే వస్తుండటంతో కంగారు 
  • ఇకపై చేయనంటూ చెప్పిన బ్యూటీ


ఇప్పుడు సినిమాకి ఒక ఐటమ్ సాంగ్ అనేది ఆనవాయతీగా మారిపోయింది. ఐటం సాంగ్ లేకపోతే అదేదో లోపం జరిగిపోయిందనుకునే రోజులు వచ్చాయి. ఐటమ్ సాంగ్ అనేది మాస్ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే మంత్రంలా మారిపోయింది. మాస్ సాంగ్ లో అన్ని వైపుల నుంచి మసాలా పడాలి... ఎవరు ఏవైపు నుంచి ఆ మసాలా చల్లినా అది సమపాళ్లలో కుదరాలి. అలా మసాలా దట్టించినప్పుడే అది జనంలోకి పరిగెడుతుంది. వాళ్లందరినీ థియేటర్ కి పరిగెత్తుకు వచ్చేలా చేస్తుంది. 

ఐటమ్ సాంగ్ కోసం కూడా స్టార్ హీరోయిన్ ను తీసుకొచ్చే ట్రెండ్ మొదలై చాలాకాలమే అవుతోంది. ఒక సినిమా చేస్తే వచ్చే పారితోషికం, ఒక సాంగ్ చేస్తే వచ్చేస్తూ ఉండటంతో స్టార్ హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ పట్ల మంచి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

ఒక సినిమాలో అసలు హీరోయిన్ కంటే... ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్స్ ఎక్కువ పారితోషికం అందుకుంటున్న సందర్భాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే స్టార్ హీరోయిన్స్ ఐటమ్ చేయాలంటే కొన్ని లెక్కలు ఉంటాయ్... వాటినే వాళ్లు ఫాలో అవుతుంటారు. 

'జైలర్' సినిమాలో తమన్నా చేసిన 'రా... నువ్వు కావాలయ్యా' సాంగ్ ఒక రేంజ్ లో సందడి చేసింది. ఆ పాటలో ఆమె చేసిన 'ఫ్లూట్ స్టెప్' పాప్యులర్ అయిపోయింది. అయినా ఆ సాంగ్ లో ఇంకాస్త బాగా డాన్స్ చేసి ఉంటే బాగుండేదంటూ ఇటీవల ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇక 'పుష్ప 2' సినిమాలో 'కిస్సిక్' అనే ఐటమ్ సాంగ్ తో శ్రీలీల మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. పారితోషికం కూడా గట్టిగానే ముట్టినట్టు వార్తలు వచ్చాయి. 

అయితే ఈ సినిమా తరువాత వరుసబెట్టి శ్రీలీలను అందరూ ఐటమ్ సాంగ్ కోసమే అడగడం మొదలుపెట్టారట. ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉంటుందా? అనే విషయం ఆమెకి అర్థం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. హీరోయిన్ ట్రాక్ లో నుంచి బయటికి వచ్చేస్తున్నామని భయపడిపోయిన ఈ సుందరి, ఇక ఐటమ్ సాంగ్స్ చెయ్యను గాక చెయ్యను అని తేల్చి చెబుతోంది. తమన్నా అంటే చాలా కెరీర్ చూసింది గనుక, ఐటమ్ పాటలపై కాస్త ఉత్సాహంగా ఉండటంలో తప్పులేదు. శ్రీలీల ఇప్పుడే పరుగు మొదలుపెట్టింది గనుక, ఆ మాత్రం భయపడటంలో అర్థం ఉంది కదూ!

  • Loading...

More Telugu News