Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ 'హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు' నుంచి బిగ్ అప్‌డేట్‌

Most Awaited Hari Hara Veera Mallu 1st Single Maata Vinaali Released on Jan 6th

  • ఈ నెల 6న‌ ఉద‌యం 9.06 గంట‌ల‌కు ఫ‌స్ట్ సింగిల్ 'మాట వినాలి' విడుద‌ల‌
  • ఈ సాంగ్‌ను స్వ‌యంగా ఆల‌పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • గ‌తంలో నాలుగైదు చిత్రాల్లో పాట‌లు పాడిన ప‌వ‌న్
  • చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ పాట పాడుతుండ‌డంతో ఫ్యాన్స్‌ ఖుషీ  

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా నుంచి ఓ బిగ్ అప్‌డేట్ వ‌చ్చింది. ఈ నెల 6వ తేదీ ఉద‌యం 9.06 గంట‌ల‌కు ఫ‌స్ట్ సింగిల్ 'మాట వినాలి' అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా ప్ర‌క‌టించారు. ఈ సాంగ్‌ను స్వ‌యంగా ప‌వ‌న్ ఆల‌పించ‌డం విశేషం. 

కాగా, గ‌తంలో నాలుగైదు చిత్రాల్లో పాట‌లు పాడిన ప‌వ‌న్ మ‌ళ్లీ చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సినిమాలో పాట పాడుతుండ‌డంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీర‌వాణి బాణీలు అందిస్తున్న ఈ మూవీని జ్యోతి కృష్ణ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. మార్చి 28న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

  • Loading...

More Telugu News