Michael Thangadurai: హిల్ స్టేషన్ లో హడలెత్తించే హారర్ థ్రిల్లర్!
- తమిళంలో రూపొందిన 'ఆరగన్' మూవీ
- అక్టోబర్ 4న విడుదలైన సినిమా
- కొత్త జంట చుట్టూ తిరిగే కథ
- తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్
తమిళంలో ఈ ఏడాది చివరలో విడుదలైన సినిమాలలో 'ఆరగన్' ఒకటి. మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్, శ్రీరంజని ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, అరుణ్ కేఆర్ దర్శకత్వం వహించాడు. హరి కరణ్ నిర్మించిన ఈ సినిమాకి, వివేక్ జశ్వంత్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫాంటసీ టచ్ తో సాగే హారర్ థ్రిల్లర్ ఇది.
క్రితం ఏడాది అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. 'ఆహా' తమిళ్ ఓటీటీలో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ల నుంచి యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ గతంలోనే వచ్చింది.
కథ విషయానికి వస్తే, హీరో - హీరోయిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. హీరో ఒక హిల్ స్టేషన్ లో జాబ్ చేయవలసి వస్తుంది. ఇద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ అక్కడికి వెళతారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేని ప్రాంతం అది. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్లిద్దరూ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. తెలుగు 'ఆహా'లోను ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.