Game Changer: పుష్ప 2 ట్రైలర్ రికార్డులు చెరిపేసిన గేమ్ ఛేంజర్

Game Changer Trailer Records

  • 24 గంటల్లో 180 మిలియన్ వ్యూస్
  • నాలుగేళ్లపాటు కొనసాగిన నిర్మాణం
  • సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ ట్రైలర్ రికార్డులను బద్దలుకొడుతోంది. శుక్రవారం విడుదలైన ట్రైలర్ శనివారం నాటికి అన్ని భాషల్లో కలిపి ఏకంగా 180 మిలియన్ల వ్యూస్ సాధించింది. యూట్యూబ్ లో ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతోంది. పుష్ప 2, దేవర సినిమాల ట్రైలర్ల రికార్డులను గేజ్ చేంజర్ చెరిపేసింది. 

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతి కానుకగా ఈ నెల 10న గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో గేమ్ చేంజర్ ను విడుదల చేయనున్నట్లు సినిమా మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో తాజాగా గేమ్ చేంజర్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇటీవల రిలీజైన సినిమాల ట్రైలర్ రికార్డులను గేమ్ చేంజర్ ట్రైలర్ కేవలం 16 గంటల్లోనే తిరగరాసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ మేకర్స్ విడుదల చేసిన చెర్రీ ఫొటో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

  • Loading...

More Telugu News