Jasprit Bumrah: భారత జట్టుకు షాక్.. ఆట మధ్యలో మైదానాన్ని వీడిన బుమ్రా.. కెప్టెన్‌గా కోహ్లీ

Jasprit Bumrah left the SCG for scans

  • 31వ ఓవర్ ముగిసిన తర్వాత బయటకు వెళ్లిపోయిన బుమ్రా
  • వైద్య బృందంతో కలిసి స్కానింగ్ కోసం ఆసుపత్రికి
  • 9 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిడ్నీ టెస్టు రెండో రోజు మధ్యలోనే స్టాండిన్ కెప్టెన్ బుమ్రా మైదానం వీడాడు. 31వ ఓవర్ ముగిసిన తర్వాత గాయం కారణంగా అకస్మాత్తుగా మైదానం వీడాడు. అనంతరం వైద్య బృందంతో కలిసి స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. బుమ్రా మైదానం వీడటం భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బే.

మరోవైపు, భారత బౌలర్ల దెబ్బకు ఆసీస్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. 166 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 173 పరుగులు చేసి భారత్ కంటే 12 పరుగులు వెనకబడి ఉంది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, సిరాజ్, నితీశ్‌కుమార్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

Jasprit Bumrah
Team India
Sydney Test
Virat Kohli
  • Loading...

More Telugu News