Sydney Test: నిప్పులు చెరుగుతున్న బౌలర్లు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన సిరాజ్

Siraj takes two wickets in an over

  • సత్తా చాటుతున్న సిరాజ్, బుమ్రా
  • ఒకే ఓవర్‌లో కొన్‌స్టాస్‌, ట్రావిస్ హెడ్ భరతం పట్టిన సిరాజ్
  • 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన ఐదో టెస్టులో భారత బౌలర్లు నిప్పులు చెరుగుతున్నారు. బ్యాటింగ్‌లో తేలిపోయిన జట్టు బౌలింగ్‌లో సత్తా చాటుతూ ఆసీస్ భరతం పడుతోంది. సిరాజ్, బుమ్రా దెబ్బకు ఆసీస్ వరుసపెట్టి వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.

ఓవర్‌నైట్ స్కోరు 9/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆరు పరుగులు మాత్రమే జోడించి మార్నస్ లబుషేన్ (2) వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో 20 పరుగులు జోడించాక శాం కొన్‌స్టాస్‌ కూడా పెవిలియన్ చేరాడు. 

క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన కొన్‌స్టాస్‌ (23)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. 11వ ఓవర్ వేసిన సిరాజ్ బౌలింగ్‌లో స్లిప్‌లో జైస్వాల్‌కు దొరికిపోయాడు. అదే ఓవర్ చివరి బంతికి ట్రావిస్ హెడ్‌ను కూడా అవుట్ చేసిన సిరాజ్ జట్టులో జోష్ నింపాడు. 4 పరుగులు మాత్రమే చేసిన హెడ్.. కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో పంత్ చేసిన 40 పరుగులే అత్యధికం. రవీంద్ర జడేజా 26, గిల్ 20, బుమ్రా 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బోలాండ్ 4 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్ 3, కమిన్స్ 2 వికెట్లు తీసుకున్నాడు.

Sydney Test
Mohammed Siraj
Team India
  • Loading...

More Telugu News