CMR College: బాత్రూంలో వీడియోల చిత్రీకరణ ఇష్యూ... సీఎంఆర్ కాలేజీకి మూడు రోజులు సెలవు

CMR college announced three day holiday

  • ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పన్నెండు సెల్‌ఫోన్లు స్వాధీనం... వేలిముద్రల సేకరణ
  • కాలేజీకి వచ్చి సమాచారం సేకరించిన మహిళా కమిషన్ కార్యదర్శి

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీకి యాజమాన్యం మూడు రోజులు సెలవులు ప్రకటించింది. కాలేజీ హాస్టల్ బాత్రూం గదిలో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థినులు ఆరోపిస్తూ... మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ వార్డెన్ సహా ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి పన్నెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని... వాటిని పరిశీలిస్తున్నారు. నిందితుల వేలిముద్రలను పోలీసులు సేకరించారు.

బాత్రూంలో వీడియోలు చిత్రీకరించారంటూ విద్యార్థినులు బుధవారం అర్ధరాత్రి వరకు కాలేజీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. అమ్మాయిలకు ఏబీవీపీ, ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ తదితర విద్యాసంస్థలు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నాయి. బీజేవైఎం నేతలు కూడా విద్యార్థినుల ఆందోళనకు మద్దతు పలికారు.

మరోవైపు, ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ కార్యదర్శి పద్మజారమణ హాస్టల్‌కు వచ్చి పరిశీలించారు. విద్యార్థినుల నుంచి సమాచారం సేకరించారు.

  • Loading...

More Telugu News