Sandhya Theatre Stampede: నాంపల్లి కోర్టులో సంధ్య థియేటర్ యజమాన్యం బెయిల్ పిటిషన్
- తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంధ్య థియేటర్ యజమానులు
- బెయిల్ పిటిషన్ వేసిన థియేటర్ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి
- ఈ కేసులో 'ఏ1'గా పెద్దరామిరెడ్డి, 'ఏ2'గా చిన్నరామిరెడ్డి
- మరికాసేపట్లో బన్నీ రెగ్యులర్ బెయిల్‌పై తీర్పు
డిసెంబర్ 4న 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యజమాన్యం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యజమాన్యం తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది.
సంధ్య థియేటర్ యజమానులు పెద్దరామిరెడ్డి, చిన్నరామిరెడ్డి బెయిల్ పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో 'ఏ1'గా పెద్దరామిరెడ్డి, 'ఏ2'గా చిన్నరామిరెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. దాంతో కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.
మరికాసేటపట్లో బన్నీ రెగ్యులర్ బెయిల్‌పై తీర్పు
ఇక ఈ కేసులో నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాళ్టికి (శుక్రవారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే.