Pushpa 2: నాలుగు వారాల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 'పుష్ప‌2' మొత్తం ఎంత వ‌సూలు చేసిందంటే..!

Pushpa 2 the Rule Collection Worldwide in Four Weeks

  • అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్‌లో 'పుష్ప‌-2: ది రూల్'
  • డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సినిమా
  • నాలుగు వారాల్లో రూ. 1799 కోట్లకు (గ్రాస్) పైగా వ‌సూళ్లు
  • ఈ మేరకు 'ఎక్స్' వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన పుష్ప‌-2: ది రూల్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క‌వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ నాలుగు వారాల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రికార్డు స్థాయి క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన‌ట్లు చిత్రం యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కూ రూ. 1799 కోట్లకు (గ్రాస్) పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 

" 'పుష్ప‌-2: ది రూల్' రికార్డు బ్రేకింగ్ ర‌న్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది. వైల్డ్ ఫైర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ నాలుగు వారా‌ల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 1799 కోట్ల గ్రాస్ ను వ‌సూలు చేసింది" అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. 

కాగా, ఇందులో ఉత్త‌రాది నుంచే అధిక వ‌సూళ్లు వ‌చ్చాయి. హిందీ వెర్ష‌న్ ఒక్క‌టే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 1000 కోట్లు (గ్రాస్‌) వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఇది భార‌తీయ సినీ హిస్ట‌రీలోనే ఏ హిందీ వెర్ష‌న్ మూవీ సాధించ‌ని రికార్డుగా చెబుతున్నారు. అటు ఆన్‌లైన్ బుకింగ్‌లోనూ పుష్ప‌రాజ్ హ‌వా కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ 'బుక్‌మై షో'లో ఏకంగా 19.5 మిలియ‌న్ల టికెట్లు అమ్ముడు పోయాయి.    

  • Loading...

More Telugu News