Ramcharan: 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చరణ్ చెప్పింది ఇదే!

Game Changer Movie Trailer Launch Event

  • జనవరి 10వ తేదీన రానున్న 'గేమ్ ఛేంజర్'
  • ట్రైలర్ లాంచ్ ఈవెంటులో కనిపించిన సందడి
  •  శంకర్ దర్శకత్వంలో చేయడం గర్వంగా ఉందన్న చరణ్
  • చరణ్ యాక్టింగ్ అద్భుతమన్న శంకర్  


'గేమ్ ఛేంజర్' ఈవెంట్లో చరణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రాజమౌళి గారికి థాంక్స్. రాజమౌళి గారు, శంకర్ గారు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారు. ఇద్దరూ చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తుంటారు. శ్రీకాంత్ గారు, ఎస్ జే సూర్య గారు, సముద్రఖని గారు, అంజలి గారు, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చింది. అందరి పర్ఫామెన్స్‌లతోనే ఈ సినిమా ఎలివేట్ అవుతోంది. సాయి మాధవ్ బుర్రా గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. దిల్ రాజు గారు, శిరీశ్ గారు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు" అని అన్నారు. 

డైరెక్ట‌ర్ శంకర్ మాట్లాడుతూ.. ‘గేమ్ ఛేంజర్' చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి. సోషల్ కమర్షియల్, మాస్, ఎంటర్టైనర్‌గా ఉంటుంది. ఓ పొలిటికల్ లీడర్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథ. హీరో పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. సాంగ్స్, యాక్షన్స్, పర్ఫామెన్స్ ఇలా అన్నింట్లో చరణ్ గారు అద్భుతంగా నటించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్ అందరి హృదయాల్ని గెలిచేస్తారు. కియారా అద్వాని గారు రామ్ చరణ్ గారితో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. 

నేను ఏం అడిగినా, ఏం చెప్పినా కూడా దిల్ రాజు ఇచ్చారు. నన్ను తెలుగుకి పరిచయం చేసినందుకు దిల్ రాజు గారికి థాంక్స్. రెహమాన్ లేడనే లోటు నాకు తెలీకుండా తమన్ నా నమ్మకాన్ని నిలబెట్టారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్‌లా మనం తీయాలని అనుకుంటాం. కానీ హాలీవుడ్‌ లో కూడా ఇప్పుడు మనలా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు. దానికి కారణం రాజమౌళి గారు" అని అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ.. "తమిళ్ సినిమాను శంకర్ గారు పాన్ ఇండియాగా చేశారు. రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి. డల్లాస్ ఈవెంట్‌లో చాలా మాట్లాడాం. ఇంకా నాలుగో తేదీన చాలా మాట్లాడాల్సి ఉంది. శంకర్ గారు ఇప్పటివరకు చేసినదంతా మెల్లమెల్లగా రివీల్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ట్రైలర్‌ను రిలీజ్ చేశాం. ఇప్పటి వరకు మేం చూపింది కేవలం యాభై శాతమే. అసలు మ్యాటర్ ఏంటో జనవరి 10న తెలుస్తుంది. రామ్ చరణ్‌తో సినిమా అంటే ఎలా ఉండాలో అలానే ఉంటుంది" అని అన్నారు.

  • Loading...

More Telugu News