K Kavitha: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కాల్

Kavitha calls Hyderabad CP CV Anand

  • ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే బీసీ సభకు అనుమతించాలని విజ్ఞప్తి
  • సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సభను తలపెట్టినట్లు వెల్లడి
  • ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికే విడుదల చేసిన కవిత

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్ చేశారు. రేపు ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన బీసీ సభకు అనుమతివ్వాలని కోరారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ సభను తలపెట్టినట్లు చెప్పారు. ఈ సభ నిర్వహణను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్ అమలుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలనే డిమాండ్‌తో సావిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేపు ఇందిరా పార్క్ వద్ద బీసీ మహాసభ నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ సభ నిర్వహణపై కవిత ఇప్పటికే బీసీ సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. మహాసభ పోస్టర్‌ను కూడా ఇటీవల విడుదల చేశారు. అయితే, ఈ మ‌హాస‌భ‌కు ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. గురువారం ఉద‌యం నుంచి సెంట్ర‌ల్ జోన్ డీసీపీ కార్యాల‌యం వ‌ద్ద జాగృతి, పలువురు బీసీ సంఘాల నాయ‌కులు అనుమతి కోసం వేచి చూస్తున్నారు.

K Kavitha
BRS
Telangana
CV Anand
  • Loading...

More Telugu News