Game Changer Trailer: 'గేమ్ ఛేంజ‌ర్' ట్రైల‌ర్ విడుద‌ల‌.. అంద‌రూ ఊహించిన‌ట్లుగానే అద‌ర‌గొట్టిన చెర్రీ!

Game Changer Trailer out now

  • రామ్‌చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబోలో 'గేమ్ ఛేంజ‌ర్'
  • మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన‌ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి 
  • తండ్రీకొడుకులుగా రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న అదుర్స్‌
  • జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'గేమ్ ఛేంజ‌ర్'. సంక్రాంతి కానుక‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి విడుద‌ల చేశారు. అంద‌రూ ఊహించిన‌ట్లుగా ట్రైల‌ర్ అదిరిపోయింది. 

తండ్రీకొడుకులుగా రామ్ నంద‌న్‌, అప్ప‌న్న పాత్రల్లో రామ్ చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టారు. డైలాగ్స్ థియేట‌ర్ల‌ను మోతెక్కించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక సీన్ల‌కు త‌గ్గ‌ట్టుగా త‌మ‌న్ బీజీఎం వేరే లెవెల్ అని చెప్పాలి. మొత్తానికి ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ప్రేక్ష‌కుల‌కు శంక‌ర్ అందించ‌బోతున్నార‌ని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.
 
చ‌ర‌ణ్‌కు జోడిగా బాలీవుడ్ న‌టి కియారా అద్వానీ న‌టించిన‌ ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించ‌గా.. స‌ముద్ర‌ఖ‌ని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

  • Loading...

More Telugu News