Daaku Maharaaj: 'డాకు మహారాజ్' నుంచి 'దబిడి దిబిడి' పాట వచ్చేసింది!
- బాబీ, బాలకృష్ణ కాంబోలో ‘డాకు మహారాజ్’
- 'దబిడి దిబిడి' పాటపై బాలయ్యతో కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులేసిన ఊర్వశి రౌతేలా
- ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘డాకు మహారాజ్’లోని ‘దబిడి దిబిడి’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు అభిమానులను ఆకట్టుకోగా, ఈ మూడో సాంగ్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ పాటపై బాలయ్యకు జోడీగా ఊర్వశి రౌతేలా కనిపించింది.
సాంగ్ లో ఇద్దరూ కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులు వేయడం కనిపించింది. మామూలుగా బాలయ్య పాటల్లో వేసే స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా విడుదలయిన లిరికల్ సాంగ్‌లో కూడా అలాంటి స్టెప్పులు ఉన్నాయి. అలాగే ఊర్వశి రౌతేలా గ్రేస్ అయితే పాటకు ఎక్స్‌ట్రా అందాన్ని యాడ్ చేసింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.